V1News Telangana

best news portal development company in india

బోరిగాంలో బుద్ధ విగ్రహ పునఃప్రతిష్ఠకు బౌద్ధుల నిరాహార దీక్షకు మద్ధతుగా ముధోల్ నేతల సంఘీభావం…

SHARE:

ముధోల్, నిర్మల్ జిల్లా:

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని బుద్ధ-అంబేద్కర్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాళ్ల బోరిగాం గ్రామంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలనే డిమాండ్‌తో స్థానిక బౌద్ధ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలపడం కోసం ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాడేవార్ గ్రామాన్ని సందర్శించి బౌద్ధుల్ని పరామర్శించారు.

ఈ సందర్శనలో డాక్టర్ దగ్దే కపిల్, నిమ్మ సురేష్, రావుల పోశెట్టి, హసిడే సజన్, అబ్దుల్ వాసి రసూల్, అజీజ్ ఖురేషి, భీమేష్, మహిపాల్, ఆమీర్ తదితరులు పాల్గొన్నారు. వారు బౌద్ధ సమాజాన్ని ధైర్యం చెప్పి, వారి న్యాయమైన డిమాండ్‌కు అండగా ఉన్నామన్నారు.

బౌద్ధ విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించిన ఈ నాయకులు, అది కేవలం విగ్రహం మాత్రమే కాదని, బౌద్ధుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. అధికారులు బౌద్ధుల మనోభావాలను గౌరవించి విగ్రహ పునఃప్రతిష్ఠకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india