V1News Telangana

best news portal development company in india

మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేత….

SHARE:

– గొప్ప మనసు చాటుకుంటున్న యువ నాయకులు

– కృతజ్ఞతలు తెలిపిన మృతుని కుటుంబ సభ్యులు

– పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని స్పష్ఠీకరణ

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లా బాద్ మండల కేంద్రంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు మన్నే సాగర్, కృష్ణ,మహేందర్ ల తండ్రి మన్నే వెంకన్న గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హఠాన్మరణం చెందారు.విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు సున్నం సాయిలు చొరవ తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు, NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న శశాంక్ గొప్ప మనసుతో వెంటనే స్పందించి బుధవారం రోజు బిజెపి జిల్లా నాయకులు సున్నం సాయిలు చేతుల మీదుగా మన్నె వెంకన్న సతీమణి అనుషవ్వకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఇంటి వద్దకు వచ్చి ఆర్థిక సహాయం చేసినందుకు మృతుని కుటుంబ సభ్యులు కోనేరు శశాంక్ కు మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నసురుల్లా బాద్ మండల ప్రధాన కార్యదర్శి మేకల రామన్న యాదవ్, కిసాన్ మోర్ఛా అధ్యక్షులు గొడిసెల యాదగిరి గౌడ్,సీనియర్ నాయకులు పెర్క రాములు, యువ మోర్ఛా అధ్యక్షులు ర్యాపని మహేష్, భూత్ అధ్యక్షులు ఉల్లెంగ గోపి, కంది మల్లేష్, టేకుర్ల పవన్,కొప్పుల సాయిలు,బండపల్లి శ్రీనివాస్, ఉల్లెంగ సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india