V1News Telangana

best news portal development company in india

భారతదేశ త్రివిధ దళాల సైనికుల సేవలు దేశానికి గర్వకారణం…..

SHARE:

– పోతంగల్ మండల కేంద్రంలో ఘనంగా తిరంగా యాత్ర

– భారీ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న ప్రజలు

– రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

పోతంగల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం రోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో భారతదేశ త్రివిధ దళాలకు చెందిన సైనికుల సేవలను కీర్తిస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జవాన్ జంగం సంజీవ్ కుమార్ ను నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు సంజీవ్ కుమార్ మరియు విద్యార్థిని మానస భారతదేశ ఖ్యాతిని మరియు యుద్ధం సమయంలో త్రివిధ దళాల పనితీరును కీర్తిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. యుద్ధంలో ఉగ్రవాదులను కొత్త మారుస్తూ భారతదేశంలో ప్రతిఘటించిన తీరును చూసి ప్రపంచ దేశాలు వనికి పోయాయని అభివర్ణించారు. క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని, ప్రజలను సంరక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరించిన విధానాల పట్ల కీర్తిస్తూ అందువల్లనే ఆయన ప్రపంచం మెచ్చిన నాయకుడయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india