V1News Telangana

best news portal development company in india

సాలూరలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు – జూన్ 3 నుండి గ్రామాగ్రామంగా ప్రారంభం….

SHARE:

సాలూర, జూన్ 2:సాలూర మండలంలో జూన్ 3వ తేదీ నుండి రెవెన్యూ గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబడనున్నట్లు తహశీల్దార్ కార్యాలయం తెలిపింది. భూ భారతి చట్టం అమలు భాగంగా, మండలంలోని వివిధ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి.

ఈ సందర్భంగా తహశీల్దార్ సాలూర పేర్కొంటూ, “రైతులు, భూ యజమానులు తమ భూములకు సంబంధించిన సమస్యలను రికార్డులతో సహా తీసుకుని రావాలి. సదస్సుల వేదికపైనే పరిష్కారాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని సూచించారు.
ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రత్యేకంగా నిర్వహించబడే ఈ సమావేశాలు, భూ తగాదాలు, రికార్డు లోపాలు, హక్కుల స్పష్టత తదితర అంశాలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయనున్నారని తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పొందగలరని తహశీల్దార్ పేర్కొన్నారు.‌

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india