V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో సీనియర్ జర్నలిస్టుపై దాడి – పత్రికా వర్గాల్లో కలకలం వార్త సేకరణ చేస్తున్న జర్నలిస్టును బెదిరించిన బార్ నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛపై దాడి – బాధ్యులపై చర్యలకోసం బోధన్ జర్నలిస్టుల ఆందోళన “జర్నలిస్టుల భద్రత ఎక్కడ?” – బోధన్‌లో ముక్తకంఠంగా నిరసన . పత్రికా కలం దెబ్బలకొస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: పాత్రికేయుల హెచ్చరిక…

SHARE:

బోధన్, నిజామాబాద్ జిల్లా:
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో నిష్పక్షపాతంగా తన విధిని నిర్వర్తిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టుపై జరిగిన దాడి పత్రికా వర్గాల్లో తీవ్ర స్పందన కలిగించింది. గత రాత్రి వార్త సేకరణలో భాగంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సమయంలో, MSR బార్ నిర్వాహకులు ఆయన్ని అడ్డగించి, ఫోన్ లాక్కొని తీవ్రంగా బెదిరించారు.

ఈ దాడిని మీడియా ప్రతినిధులు పత్రికా స్వేచ్ఛపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణిస్తున్నారు. ఘటనను తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ బాధితుడికి న్యాయం కల్పించాలని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.

“ఇలాంటివి కొనసాగితే ప్రజల పక్షాన మనం ఎలా పని చేయగలం?” అని పలువురు పాత్రికేయులు వేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వాతంత్య్రాన్ని తుంచివేసే ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని పతనమవుతాయని హెచ్చరించారు.

మీడియా వర్గాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇది కలం గొంతు నలిపే ప్రయత్నం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని మీడియా ప్రతినిధులు హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india