*ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్*
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు జరిగాయని, అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని బైంసా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర అమోఘం అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత గా ఉన్న సుష్మ స్వరాజ్ చిన్నమ్మ పాత్ర వహించి, తెలంగాణ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ తో పాటు ఎందరో మహానీయులు పోరాటం చేశారన్నారు.
*బైంసా ఏరియా ఆసుపత్రికి పది లక్షల విలువ చేసే బెడ్ల పంపిణీ*
తన మిత్రుని సహకారంతో ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ భైంసా ఏరియా ఆసుపత్రికి పది లక్షల రూపాయల విలువగల ఐసి యు బెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దతామన్నారు. త్వరలోనే ప్రపంచ బ్యాంకు నిధులు ఐదు కోట్ల రూపాయలతో ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు. ఒకప్పుడు పదిమంది డాక్టర్లు ఉండేవారని, తన హయాంలో 30 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమాల్లో బైంసా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్, తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








