V1News Telangana

best news portal development company in india

రైతుల భూ సమస్యలకు పరిష్కార మార్గం! రేపటి నుంచే బోధన్‌లో గ్రామసభలు

SHARE:

బోధన్, నిజామాబాద్ జిల్లా: రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం బోధన్ మండలంలో ప్రారంభం కానుంది. రేపటి నుంచే (జూన్ 3, 2025) భూభారతి ఆధ్వర్యంలో రైతు గ్రామసభలు నిర్వహించనున్నట్టు తహసీల్దార్ విఠల్ వెల్లడించారు.

oplus_8388608

ఈ గ్రామసభల ద్వారా రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను అధికారులకు ప్రత్యక్షంగా అందజేయవచ్చు. దరఖాస్తుల రూపంలో వివరాలు సమర్పించడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో అధికారులు ప్రత్యక్షంగా పాల్గొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

తహసీల్దార్ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం బోధన్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ సభలు జరుగనున్నాయి. రైతులు తమ భూముల పత్రాలు, అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొని హాజరుకావాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం రైతులకు భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను వేగంగా, నేరుగా పరిష్కరించడం.
“రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ సమస్యకి పరిష్కారం కచ్చితంగా ఉంటుంది,” అని తహసీల్దార్ విఠల్ పేర్కొన్నారు.
రైతులకు ఇది చక్కటి అవకాశం. తమ హక్కుల కోసం, భూముల రక్షణ కోసం గ్రామసభల వైపు అడుగేయండి!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india