V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ ఎస్సై సాయన్నకు మహోన్నత గౌరవం!…. ఉత్తమ సేవలకు మహోన్నత గుర్తింపు – సాయన్నకు తెలంగాణ సర్కార్ నుంచి సత్కారం…. . సాయన్నకు మరో ఘనత – మహోన్నత సేవ పథకం, రూ.40,000 బహుమతి . ఒక పోలీస్ అధికారి – అనేక ప్రశంసలు! నిస్వార్థ సేవకు న‌మస్సు – రుద్రూర్ ఎస్సైకు రాష్ట్ర స్థాయి గౌరవం…

SHARE:

రుద్రూర్:పోలీసు సేవలో పరిపూర్ణ నిబద్ధత, ప్రామాణికతతో ముందుకు సాగుతున్న రుద్రూర్ ఎస్సై పి. సాయన్నకు మరోసారి గౌరవం దక్కింది. గతంలో సేవా పథకం, ఉత్తమ సేవా పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుర్తింపు పొందిన సాయన్నను ఈసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా “మహోన్నత సేవ పథకం” కోసం నామినేట్ చేశారు. అంతే కాదు, ఈ పథకం కింద రూ.40,000 నగదు బహుమతి కూడా వరించనుంది.

ఈ అద్భుత విజయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ప్రజలకు అండగా నిలుస్తూ, నిష్కలుషంగా విధులు నిర్వర్తిస్తున్న సాయన్నకు ఇది న్యాయమైన గుర్తింపు అని ప్రశంసల వర్షం కురిపించారు.

సేవ అంటే కేవలం విధి నిర్వహణ కాదని, అది ఒక సమాజబద్ధ నిబద్ధత అని ప్రూవ్ చేసిన పోలీస్ అధికారి సాయన్న ఇప్పుడు యువ పోలీసులకు ప్రేరణగా మారారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india