V1News Telangana

best news portal development company in india

ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ….

SHARE:

– ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పౌరసరఫరాల శాఖ

– ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు

– ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని డీలర్ల వెల్లడి

– తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రాష్ట్ర ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు.. ఇప్పుడు అదే రేషన్ బియ్యాన్ని జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ప్రజలకు అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 వ తేదీ నుండి గ్రామంలో గల రేషన్ షాపుల్లో ప్రజలకు మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారని తహసిల్దార్ ఎల్.ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిధిలో గల గ్రామాలలో రేషన్ షాపుల్లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయా గ్రామాల రేషన్ డీలర్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు మూడు నెలల బియ్యం ఒకేసారి తీసుకెళ్లాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని మండల రేషన్ డీలర్లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india