Post Views: 273
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాళ్ల భోరీగం గ్రామంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ విగ్రహావిస్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, స్థానిక గ్రామస్థులు దళితులపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AiPSU) రాష్ట్ర కమిటీ నాయకుడు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, దళితులపై దాడి చేసిన వారిపై తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే, బుద్ధ విగ్రహ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు ఎకరాలు కేటాయించాలని కోరారు. భోరీగం బుద్ధిస్టులకు న్యాయం జరగకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








