– ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహణ
– రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
– సైనికులను సత్కరించి వారి సేవలకు నీరాజనాలు తెలిపిన ప్రజలు
– వీర జవానుల త్యాగాలు వెలకట్టలేనివి
– బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సైనికుల సేవలను, వారి త్యాగాలను గుర్తిస్తూ ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ క్రమంలో కామప్ప మందిరం నుండి రామాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రయాణ ప్రాంగణం ఆవరణలో బాన్సువాడ నియోజకవర్గం నుండి ఆర్మీలో సేవలందిస్తున్న సైనికులు మాజీ సైనికులు సంజీవ్ కుమార్, సర్వీస్ సైనికులు రామకృష్ణ, మహమ్మద్ షరీఫ్, సతీష్ లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ పాక్ ఉగ్రదాడులను ప్రతిఘటిస్తూ భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యుద్ధంలో సైనికులు అందించిన సేవలను ఆయన కొనియాడారు. సైనికులు పగలనకా ,రాత్రనక , భార్య పిల్లలను, తల్లిదండ్రులను వదిలిపెట్టి నిద్రాహారాలు మానుకొని సేవలందించడం వలన మనము ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని అన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








