V1News Telangana

best news portal development company in india

నూతన నేరన్యాయ చట్టాలపై నిజామాబాద్ పోలీసుల కఠిన హెచ్చరిక — చట్టాలు తెలుసుకోకపోతే శిక్ష తప్పదు!

SHARE:

నిజామాబాద్, మే 28:నూతన నేరన్యాయ చట్టాలపై ప్రతిజనరలిస్టు — ప్రతి పౌరుడూ అవగాహన కలిగి ఉండాలి అని స్పష్టం చేస్తూ, నేడు నిజామాబాద్‌లో పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., నేతృత్వంలో జర్నలిస్టులకు అవగాహన సదస్సు నిర్వహించారు.‍

శ్రీ రామ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, జులై 1, 2024 నుండి అమల్లోకి రానున్న మూడు కీలక చట్టాలు — భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియమం — పౌరుల హక్కులు, బాధ్యతలపై స్పష్టత కలిగించేందుకు తీసుకొచ్చినవని, అందరికీ వీటి గురించి స్పష్టమైన అవగాహన అవసరమని తెలిపారు.

“చదవకపోతే తప్పు, తెలియకపోయినా శిక్ష మాత్రం తప్పదు!” — పోలీస్ కమిషనర్ హెచ్చరిక

మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించిన ఆయన, ముఖ్యంగా క్రైమ్ వార్తల విషయంలో మైనర్ల వివరాలు బయటపెట్టొద్దని, బాధితుల గోప్యత కాపాడాల్సిన బాధ్యత తమదేనని గుర్తుచేశారు. “సోషల్ మీడియా వినియోగంలోనూ పూర్తి బాధ్యత అవసరం — ఎలాంటి ఫోటో, వీడియో అయినా ప్రచురించే ముందు అనుమతి తీసుకోవాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు” అని తీవ్రంగా హెచ్చరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంలోనూ అప్రమత్తంగా ఉండాలంటూ, “సత్యం లేని విషయాన్ని వాస్తవంగా చూపించే టెక్నాలజీ ఉందని తెలుసుకోండి. కానీ అదే టెక్నాలజీ మీకు శత్రువవుతుంది” అని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీ బస్వారెడ్డి, ట్రాఫిక్, రూరల్, అర్బన్ ఏసీపీలు, ఎస్ఐలు మరియు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రాంతాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చట్టాల్లో మార్పులపై స్పష్టతనిచ్చారు. జర్నలిస్టుల సందేహాలకు సమాధానాలు అందించారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india