– అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భూత్ మహిళా ప్రముఖ్ కృష్ణవేణికి ఆర్థిక సాయం అందజేత
– కుటుంబ సభ్యులను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఓదార్పు
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త 152 వ భూత్ కమిటీ మహిళా ప్రముఖ్ జంబిగ కృష్ణవేణి అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం బాన్సువాడ పట్టణంలో గల 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ వెంటనే స్పందించి బిజెపి జిల్లా నాయకులు సున్నం సాయిలు చేతుల మీదుగా అందింపజేశారు.శనివారం రోజు బాన్సువాడ ఆసుపత్రికి వెళ్లి జిల్లా నాయకులు సున్నం సాయిలు భూత్ మహిళా ప్రముఖ్ కృష్ణవేణి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆమె త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించారు. అనంతరం రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నసురుల్లాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మేకల రామన్న, మండల యువ సేన అధ్యక్షులు ర్యాపని మహేష్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు యాదగిరి గౌడ్, నసురుల్లాబాద్ రామాలయం చైర్మన్ అరిగే నారాయణ, మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్ రావ్, బొమ్మన్ దేవ్ పల్లి భూత్ అధ్యక్షులు శేఖర్,కొప్పుల సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








