ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం రోజు భూవివాదం చుట్టూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తన భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయాన్న ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్, భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాల మేరకు అధికారులు గ్రామానికి చేరుకుని బాధితుడితో పాటు వివాదంలో ఉన్న పక్షాలను ప్రత్యక్షంగా విచారించారు. భూమికి సంబంధించిన పత్రాలను అందజేయాలని సూచించడంతో పాటు, భూ కొలతలు నిర్వహించాలని మండల సర్వేయర్ ప్రవీణ్‌ను ఆదేశించారు.
తహసీల్దార్ శ్రీలత ఆధ్వర్యంలో సర్వేయర్, ఆర్ఐలు నారాయణ రావు పటేల్, సరస్వతి తదితర రెవెన్యూ సిబ్బంది కొలత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ముధోల్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి కె. గురు ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.
విచారణ కార్యక్రమానికి సిఐ మల్లేష్, ఎస్ఐ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులు హాజరయ్యారు.
– ఎడ్బిడ్ గ్రామం, ముధోల్
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








