Post Views: 207
దిలవార్పూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ శాసన మండలి పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి కటింగ్ లేకుండా నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టంగా సూచించారు.
ఈ సందర్బంగా జిల్లా మరియు మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు రైతులకు మేలు చేసేలా ఉండాలని, ఏ విధమైన అవకతవకలూ చోటు చేసుకోకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








