V1News Telangana

best news portal development company in india

ఆవులకు మత్తుమందు ఇచ్చి దొంగతనం – ఆరుగురు అరెస్ట్.,.. . ముఠా గుట్టు రట్టు చేసిన నిజామాబాద్ CCS పోలీసులు….. ఇన్నోవా కారులో మత్తు మందు ఇచ్చిన ఆవులు – పోలీసులకి చిక్కిన ముఠా… పోలీసుల బోర్డు పెట్టిన కారుతో దొంగతనాలు – 6 మంది అరెస్ట్…. నాందేడ్‌ నుండి దొంగలు పట్టివేత – నిజామాబాద్ పోలీసుల విజయం….

SHARE:

నిజామాబాద్, మే 22:
నిజామాబాద్‌లో ఆవులను మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి చోరీ చేస్తున్న ముఠాను పట్టుకునే విషయంలో పోలీస్ కమిషనరేట్‌కు చెందిన CCS అధికారులు ఓ కీలక విజయాన్ని సాధించారు. పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు, CCS ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ నేతృత్వంలో సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్ లతో కూడిన బృందం నాందేడ్‌ వెళ్లి రెండు రోజుల పాటు ముఠాపై నిఘా పెట్టారు.

ఈ ఆపరేషన్‌లో నాందేడ్‌కు చెందిన సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆమర్, అబ్దుల్ కలాం, సయ్యద్ షోయబ్ మరియు ముంబైకి చెందిన సమీర్ అలీ ఖురేషీ, మహబూబ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరు వాడుతున్న ఇన్నోవా వాహనంలో పోలీస్ మరియు ప్రెస్ బోర్డులు ఏర్పాటు చేసి, నకిలీ నంబర్ ప్లేట్లు కలిపి దొంగతనాలకు వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వాహనం సీజ్ చేసిన అనంతరం, వారిని దెగ్లూర్ పోలీసులకు అప్పగించినట్లు కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india