– రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొన్న నాయకులు, ప్రజలు
– జాతీయ జెండాను మోస్తూ ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులు
– ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీబీ పాటిల్
– భారత సైన్యం , త్రివిధ దళాలు పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాయని ప్రసంగం
– కామారెడ్డి జిల్లా నాయకులు సున్నం సాయిలు
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో బుధవారం రోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో “తిరంగా ర్యాలీ” ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి మొదలుకొని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు కూడా జాతీయ జెండాతో ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం.. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సున్నం సాయిలు మాట్లాడుతూ “ఆపరేషన్ సింధూర్ ” ద్వారా భారతదేశ సైన్యం , త్రివిధ సాయుధ దళాలు అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పారు అన్నారు. యుద్ధంలో మురళీ నాయక్ లాంటి సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో 14 మందిని హతమార్చి చివరికి ప్రాణాలను వదిలి కన్నవారికి, కట్టుకున్న భార్యకు శోక సంద్రాన్ని మిగిల్చి యావత్ భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. విపత్కర పరిస్థితులలో దేశాన్ని, దేశ ప్రజలను కాపాడుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో తెలివిగా అనుసరించిన విధానాలు భారతీయుల మన్ననలు పొందాయని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఇంచార్జ్ యెండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్,శివప్రసాద్, పొతంగల్ మండల మాజీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్ ,రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు గొడిసెల యాదగిరి గౌడ్, మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్, యువ మోర్చా అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








