V1News Telangana

best news portal development company in india

పేదింటి అమ్మాయి పెళ్లికి ఆర్థిక సహకారం అందజేత….

SHARE:

– పెద్ద మనసుతో దాతృత్వాన్ని చాటుకున్న యువ నాయకులు

– కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

వర్ని ప్రతినిధి :

నిజామాబాద్ జిల్లా: వర్ని మండలంలోని
జలాల్ పూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బుద్దే మాదవి స్నేహ వివాహం జరిపించుట కొరకు స్థానిక బిజెపి నాయకులు ఏదైనా సహాయం చేయమని అడిగిన వెంటనే బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ వెంటనే స్పందించి రూ .5,000 ఆర్ధిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. అడిగిన వెంటనే ఆర్థిక సహకారం అందించినందుకుగాను కుటుంబ సభ్యులు మరియు స్థానిక బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఇళ్తేమ్ శంకర్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, బూత్ అధ్యక్షులు సుమన్ , ఉపాధ్యక్షులు అజయ్, బూత్ సెక్రెటరీ అన్నం కృష్ణ, మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india