V1News Telangana

best news portal development company in india

మద్యానికి బానిసై పొలంలో దాడి – రైతు చేతి పై గొడ్డలితో గాయం, బాధితుల రక్షణ కోరుతూ ఫిర్యాదు

SHARE:

ఈరోజు కసర గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పానాది సాయి నిరంజన్ మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన పానాది శివాజీపై దాడికి పాల్పడ్డాడు. పొలంలో పని చేస్తున్న శివాజిని ఆశ్చర్యకరంగా ఆశ్రయించి, గొడ్డలితో దాడి చేసి అతని చేతిపై తీవ్ర గాయాలు కలిగించాడు.

దీంతో గాయపడిన శివాజీని వెంటనే భైంసా వెంకటేశ్వర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. బాధితుడు ఈరోజు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసారు.

బాధితుల కథనం ప్రకారం, గత మూడు సంవత్సరాలుగా సాయి నిరంజన్ అనుచితంగా ప్రవర్తిస్తూ, గ్రామస్తులను బెదిరిస్తూ, “చంపేస్తా” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. అప్పటికే ఒకసారి ఎస్‌ఐకు కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు. కానీ తిరిగి అదే ప్రవర్తన కొనసాగుతూ, 100 నంబరుకు ఫోన్ చేసి ఇతరులను భయపెడుతున్నాడని అన్నారు.

ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ట్రాక్టర్ ఎత్తుకెళ్లిన ఘటనను కూడా బాధితులు పోలీసులకు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో బాధితులు ఎస్‌ఐ గారిని, సీఐ గారిని కోరుతూ – సాయి నిరంజన్‌పై కఠిన చర్యలు తీసుకుని గ్రామస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india