ఖని కోల్ సిటీలో మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్
రామగుండం నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా సింగరేణి సంస్థ కృషి
అర్జీ.1 ఏరియాలో ఘనంగా మెగా జాబ్ మేళా అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు చక్కటి ఉద్యోగ అవకాశాలు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మే 18:-
గోదావరిఖని మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశములు కల్పించుటకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జవహార్ లాల్ నెహ్రు స్టేడియం నందు భారి ఎత్తున నిర్వహించటం జరిగింది. హైదరాబాదుకు చెందిన సుమారు 100 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా సుమారు 8000 వేల పై చిలుకు నిరుద్యోగులు పాల్గోనగా ఇందులో 3000 మందిని ఎంపిక చేసి ఉద్యోగ ఉత్తర్వులను అందజేయడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇదోక చక్కటి అవకాశం అని దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాల కోసం తిరిగే అవసరం లేకుండా ఉన్న ఊరిలో చదువుకు తగిన అవకాశాలు దొరకటం ఒక అదృష్టం అని తెలిపారు. ఈ జాబ్ మేళాకు యువత ఎంతో ఉత్సాహంగా ఉదయం 6 గంటల నుండే ఇంటర్వులకు హాజరైనారు అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కూలర్లు, మాజ్జిగా, చల్లటి నీరు, స్నాక్స్, టి తోపాటు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసినందుకు సింగరేణి యాజామన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.తదనతరం ఇంటర్వు ఆధారంగా సెలక్ట్ అయిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉద్యోగ ఉత్తర్వులను అందజేయడం జరిగింది. ఉద్యోగ ఉత్తర్వులను అందుకున్న వారి కుటుంబాలు కుడా ఎంతో సంతోశానికి గురయ్యారు, ఈ అవకాశం కల్పించిన సింగరేణి సంస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ద్వారా మొదటిసారిగా నిరుద్యోగులకు ఉపాది కల్పన కోసం తిలక్ నగర్ నందు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా వివిధ కోర్సులను నిర్వహించి 100 మందికి పైగా ఉద్యోగ ఉపాది అవకాశాలు కుడా ఇదివరకే కల్పించటం జరిగిందని తేలిపారు. ఆలాగే వోల్వో ఆపరేటర్ శిక్షణ ఇచ్చి మరో 150 మంది అభ్యర్థులకు ఉపాది కల్పించడం జరిగినది. దీనివలన సంస్థలో పని చేసే ఉద్యోగులకే కాక పరిసర ప్రాంత మరియు ప్రాభావిత గ్రామాల నిరుద్యోగులకు ఇది వారికి జీవోనోపాది అవుతుందని ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులను అభినందిచారు. ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ కిరణ్ బాబు, నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సురేష్, ఏఐటియుసి బ్రాంచి సెక్రటరీ అరెల్లి పోశం ఇతర అధికారులు, నాయకులు, వివిధ యూనియన్ ప్రతినిధులు, భారి ఎత్తున అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM