బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ CSI చర్చిలో ఆదివారం నాడు మోడరేట్ ఇంచార్జి డాక్టర్ రూబెన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భవ్యంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేవుని వాక్యాన్ని ప్రబోధించారు.డాక్టర్ రూబెన్ మాట్లాడుతూ, “దేవుని యందు భక్తితో ఐకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం. మంచి మనస్సుతో చేస్తున్న ప్రతి కార్యానికి దేవుని కృప తప్పక వుంటుంది,” అన్నారు. బోధన్ పట్టణ ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఆశీస్సులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ ముల్కల ప్రభాకర్, కమిటీ ప్రతినిధులు దమ్మల్ల జ్యోతిరాజ్, ఏడ్వర్డ్ ముల్లర్ తదితరులు పాల్గొన్నారు. చర్చి కమిటీ తరపున డాక్టర్ రూబెన్‌కు ఘనంగా సన్మానం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








