V1News Telangana

best news portal development company in india

పాఠశాల బస్సులు బ్రేక్ లేని బులెట్లు కావద్దు! . పిల్లల ప్రాణాలు మించిన జాగ్రత్తలు తీసుకోండి! ఇందూర్ పాఠశాలలో రవాణా అధికారుల హెచ్చరికలు! రోడ్డు ప్రమాదాలు: స్కూల్ యజమానులకు స్పష్టమైన సూచనలు . పిల్లల భద్రతపై రాజీ లేదు – బోధన్‌లో అవగాహన సదస్సు

SHARE:

బోధన్, మే 17:
బోధన్‌లోని ఇందూర్ పాఠశాల ప్రాంగణంలో శనివారం ఓ కీలకమైన అవగాహన సదస్సు నిర్వహించబడింది. పాఠశాల యజమానులు, బస్సు డ్రైవర్లకు రోడ్డుప్రమాదాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ప్రొజెక్టర్ ప్రదర్శన ద్వారా విద్యా సంస్థల బాధ్యతలపై హితబోధ చేశారు.

జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, “పిల్లల ప్రాణాలు ఆటవేడుక కాదని, ప్రతి బస్సు సామర్థ్యం, బ్రేక్ వ్యవస్థలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఇందూర్ పాఠశాల కరస్పాండెంట్ కిషోర్, విద్యావికాస్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సదస్సు తర్వాత బోధన్ విద్యాసంస్థలకు స్పష్టమైన సంకేతం వెళ్లింది—రోడ్డు భద్రత విషయమై రాజీకి తావు లేదు!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india