V1News Telangana

best news portal development company in india

శివాలయ రహదారి అభివృద్ధికి 65 లక్షల సీసీ రోడ్డు మంజూరు – ప్రొసీడింగ్ లెటర్‌ను బోస్లే నారాయణరావు పటేల్ గారు అందజేత….

SHARE:

భైంసా టౌన్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ కీలక కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, భైంసా టౌన్ శుద్ధ వాగు నుండి శివాలయం వరకు రూ. 65 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంజూరు లభించింది. ఈ ప్రోసీడింగ్ లెటర్‌ను శివాలయం కమిటీ సభ్యులకు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా శివాలయ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చెంద్రే గారు, ముత్యం రెడ్డి గారు, మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ గారు, విట్టల్ గారు, సాయినాథ్ గారు, నాగేష్ గారు, గోపి గారు, అట్టల్ దేవి దాస్ గారు, ఇతర శివాలయం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india