V1News Telangana

best news portal development company in india

బుద్ధ జయంతి ఘటనపై అంబేద్కర్ ప్రొటెక్షన్ కమిటీ స్పందన… . రాళ్లబోరుగా గ్రామం సంఘటనపై కలెక్టర్‌కు వినతి… బుద్ధ ఫాలోవర్స్‌పై దాడి – కమిటీ ఆందోళన వ్యక్తం…. . రాళ్లబోరుగా బాధితులకు న్యాయం కల్పించాలన్న డిమాండ్…. . అధికారుల హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన సంఘం నేతలు…

SHARE:

ఘటనపై ప్రొటెక్షన్ కమిటీ వినతి…

Oplus_16908288

ఈరోజు జరిగిన సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ కింద పలువురు సభ్యులు ముఖ్యంగా రాజారాం గారు, నరేష్ గారు, సిరి రాములు అన్నగారు, గంగన్న గారు, అడ్వకేట్ అశోక్ చంద్ర గారు, గంగాధర్ దాడి గారు పాల్గొన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని రాళ్లబోరుగా గ్రామంలో బుద్ధ జయంతి సందర్భంగా శాంతియుతంగా జరుగుతున్న పూజ కార్యక్రమంపై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధితులకు న్యాయం చేయాలనే కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ మేడమ్ గారికి వినతి పత్రం అందజేశారు.

ఈ ఘటనలో బుద్ధుని విగ్రహం వద్ద పూజ నిర్వహిస్తున్న వారిపై గ్రామస్థులు దాడికి పాల్పడినట్లు, అనంతరం ఇల్లీగల్ కేసులు నమోదు చేయడంపై కమిటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల హామీ మేరకు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని తెలియజేయడంపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.

కమిటీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి అవసరమైతే ఉద్యమించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేసింది. బుద్ధిజం మరియు సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india