బోధన్, నిజామాబాద్:
బోధన్ మండలంలోని సిద్దాపూర్, కండుగాం పాయింట్ల నుండి ప్రతి రోజు భారీగా ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక తరలింపు జరుగుతోంది. ఈ తరలింపు సక్రమమైనదా లేక అక్రమమా అన్నదానిపై ప్రజల్లో స్పష్టత లేక, అనేక ఆరోపణలు, ప్రశ్నలు ముసురుతున్నాయి.
ఇసుక తవ్వకాల్లో మిషిన్ల వాడకం, జెసిబీల ద్వారా లోతైన తవ్వకాలు వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, కొన్ని గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని స్థానికులు అంటున్నారు. ప్రత్యేకంగా కల్దుర్కి గ్రామ ప్రజలు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.
ఇలాంటి వార్తలను వెలుగులోకి తీసుకువచ్చిన విలేకరులపై కొంతమంది నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ,
వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్మీట్లు నిర్వహించడం, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడిగా ప్రజలు విమర్శిస్తున్నారు…
మరోవైపు, కొన్ని మండలాల్లో కొంతమంది విలేకరులే ఇసుక మాఫియాలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా పొతంగల్, బోధన్ మండలాల్లో కొంతమంది విలేకరులే సూత్రధారులుగా ఉండి, మీడియా పేరును అడ్డుపెట్టుకొని ఇసుక రవాణాలో పాల్గొంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రజలు ప్రశ్నిస్తున్నారు –
ఇసుక రవాణా సక్రమమైతే విలేకరులపై కోపం ఎందుకు?
విలేకరులే మాఫియాలో భాగమైతే, నిజాన్ని వెలికి తీసే బలమైన మీడియా ఎవరు?
ఇలాంటి విలేకరులపై చర్యలు తీసుకునే యోచన ఎక్కడ?
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








