ఇసుక మాఫియా అరాచకాలకు మీడియా నుంచి గట్టి ఎదురుదెబ్బ పడింది. నిజాన్ని వెలుగులోకి తీసుకురావడమే నేరమయ్యే పరిస్థితుల్లో జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యాన్ని కల్లుబొర్లజేస్తున్నాయి…

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జర్నలిస్ట్ తారాచంద్‌ను లక్ష్యంగా చేసుకుని క్వారీ నిర్వాహకులు చేసిన దౌర్జన్యం – ప్రజాస్వామ్యంపై జరిగిన ఘోర దాడి. అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బహిర్గతం చేసినందుకే ఈ దుష్టకృత్యం. ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు – నాలుగు స్థంభాలలో ఒకటైన మీడియాను కూలద్రొక్కాలనే కుట్ర…
T-News కథనాల నేపథ్యంలో అధికారులు అక్రమ క్వారీలను మూసివేసిన తరువాత వచ్చిన ప్రతీకారం ఇది. ఈ దాడిని ఖండిస్తూ బోధన్ సబ్ కలెక్టర్‌కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మా మాట నిస్సహాయంగా మౌనమవదు. ప్రజల పక్షాన నిలబడడమే మా వృత్తి ధర్మం. ఇసుక మాఫియా ఎంత బలంగా ఉన్నా, మా కలం తలవంచదు” అంటూ పత్రికా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు…

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....