V1News Telangana

best news portal development company in india

ఇసుకపై అసత్య ప్రచారాలు బరదPolitics: గంగాశంకర్ తీవ్ర వ్యాఖ్యలు”

SHARE:

బోధన్ మండలంలోని మంజీరా నదిలో నుంచి ఇసుక రవాణా పూర్తిగా వే బిల్లులతోనే జరుగుతోందని, ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నదే లక్ష్యంగా చేస్తున్న దుష్ప్రచారమని టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మండిపడ్డారు. బుధవారం బోధన్ పట్టణంలోని దాము టవర్స్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇసుకపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రూ.6000కు చేరిన ఇసుక ధరను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.3500కి తీసుకొచ్చిందని, పేదలకు అందుబాటు ధరలో ఇసుక అందిస్తున్నామని స్పష్టం చేశారు. పైగా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఇసుక సరఫరా ఆగిపోతే పేద ప్రజలపై భారీ ఆర్థిక భారం పడుతుందనీ, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ఎంతోమంది పేదలకు ఉపాధి లభిస్తోందని వివరించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనవసర ఆరోపణలు, స్థానిక కాంగ్రెస్ నాయకులపై బురద జల్లే ప్రయత్నాలను తక్షణమే ఆపాలని గంగాశంకర్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగేశ్వర్ రావు, సీనియర్ నాయకులు దాము, ప్రకాష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india