V1News Telangana

best news portal development company in india

పేదల సంక్షేమానికి సీఎం సహాయ నిధి: రాకాసిపేట్‌లో చెక్కుల పంపిణీ

SHARE:

బోధన్, మే 14 పేద ప్రజలకు సీఎం సహాయ నిధి పెన్నిధిగా మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాము పేర్కొన్నారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని రాకాసిపేట్ 10వ వార్డులో మంగళవారం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దాము మాట్లాడుతూ వైద్య చికిత్స అవసరమున్న పేదలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఉద్దేశమని తెలిపారు. అర్హత ఆధారంగా, పార్టీలకు అతీతంగా నిధులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా పనిచేయాలని దాము పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి. గంగాధర్ గౌడ్, సంతోష్ గౌడ్, జీవన్ గౌడ్, గుంజరి పోశేట్టి తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india