V1News Telangana

best news portal development company in india

నిండు ప్రాణాన్ని బలిగొన్న మటన్ ముక్క….

SHARE:

– గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి వ్యక్తి మృతి

– పెద్ద దిక్కును కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు

– కుటుంబ సభ్యుల రోదనలు విని చలించిపోయిన తండావాసులు

– బొప్పాస్ పల్లి తండాలో అలుముకున్న విషాదఛాయలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొప్పాస్ పల్లి తండాకు చెందిన తారాసింగ్(48) గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుద్దులం తండాలోని బంధువుల వివాహానికి హాజరయ్యి పెళ్లి విందులో భోజనం చేస్తుండగా హఠాత్తుగా మటన్ ముక్క ఆయన గొంతులో అడ్డుపడినట్లు..దీంతో తీవ్రంగా వాంతులు చేసుకుంటూ తారాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ తెలిపారు. కుటుంబ సభ్యులు రోదించడం చూసి తండావాసులు చలించిపోయారు. బొప్పాస్ పల్లి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతునికి ఇద్దరు భార్యలు , ఇద్దరు కూతుర్లు , ఒక కుమారుడు , తల్లి ఉన్నారు.

oplus_0

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వారికి పొలము కానీ ఎటువంటి ఆదాయము కూడా లేదని కనీసం ఇంటికి తలుపులు కూడా లేవని తెలిపారు. ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి దీనస్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి పెద్ద మనసుతో నా కుటుంబానికి సహకారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india