Post Views: 213
ముధోల్ నియోజకవర్గానికి చెందిన తరోడ గ్రామంలో సోమవారం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. భగవాన్ గౌతమ బుద్ధుని జయంతిని జరుపుకుంటూ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాలలతో అలంకరించిన స్థలంలో ధ్యాన కార్యక్రమాలు, బౌద్ధ ప్రార్థనలు, సామూహిక భక్తి గీతాలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలతో గ్రామం అంతా పండుగ వాతావరణంలో కళకళలాడింది.
గ్రామ పెద్దలు, గడపాలే కల్పన, సంజు, రవి కిరణ్, అజ్మత్ తదితర యువతతో పాటు మహిళలు, చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








