V1News Telangana

best news portal development company in india

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష-2025 కోసం కట్టుదిట్టమైన బందోబస్త్

SHARE:

అండర్ సెక్షన్ 163 BNSS అమలు – జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపిఎస్

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష – 2025 సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డ ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపిఎస్ తెలిపినట్లుగా, 13-05-2025 ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరిగే పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అండర్ సెక్షన్ 163 BNSS (మునుపటి సెక్షన్ 144 CrPC) ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలియజేశారు.

నిషేధిత ఆదేశాల ప్రకారం:
. పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదు.
. నిషేధిత వస్తువులు వాహనాలు, బ్యాగులు, మొబైల్ ఫోన్లు మొదలైనవి పరీక్షా కేంద్రాల వద్ద తీసుకురావడం నిషేధం.
. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు 13-05-2025 ఉదయం 07:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మూసివేయాలి.
ఈ నిషేధిత ఉత్తర్వులు 13-05-2025 ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు అమలులో ఉంటాయి.

 

Ο

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india