V1News Telangana

best news portal development company in india

పనిగంటలు పెంచితే చాలు… కార్మికులు పోరాటమే జవాబు! . నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్‌లు – కార్మికులపై పెట్టుబడిదారుల దాడి! జీవించేందుకు వేతనం కావాలి, బానిసత్వం కాదు! . చట్టాల పేరుతో కార్మికుల జీవితాలపై కత్తిపట్టు! . రక్తతర్పణం చేసి సాధించిన హక్కులు మళ్లీ పోతున్నాయా?

SHARE:

రాణంపల్లి, మే 4:
“కార్మిక హక్కుల కోసం పోరాటం మళ్లీ మొదలైంది,” అని అన్నారు ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) రాష్ట్ర నాయకులు బి. మల్లేష్. రుద్రూర్ మండలం రాణంపల్లిలో 139వ మే డే సందర్భంగా ఎర్ర జెండా ఎగురవేస్తూ,

భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు.”8 గంటల పని దినాన్ని కార్మికులు చుక్కల రక్తంతో సాధించారు. కానీ నేడు పాలకులు పెట్టుబడిదారులకు వంగి, కార్మికులపై చట్టాల రూపంలో దాడి చేస్తున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికుల హక్కులను తుంచేస్తూ, వారికి బానిస స్థితిలో జీవించమంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.”జీవించేందుకు సరిపడా వేతనాలు, కనీసం నెలకు రూ.9,000 పెన్షన్, భద్రత కలిగిన ఉద్యోగం కావాలి,” అంటూ బి. మల్లేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TUCI ప్రముఖులు డి. నాగేశ్వర్, నవీన్, అశోక్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india