V1News Telangana

best news portal development company in india

మీడియా గొంతుకను మింగే ప్రయత్నం – ధనుంజయ్ రెడ్డి పై దాడిని ఖండించిన జర్నలిస్టులు!…. . ప్రశ్నలెన్నడూ నిషిద్ధం కావు – బోధన్‌లో సాక్షి ఎడిటర్‌కు మద్దతుగా నిరసన!… . మీడియాపై దాడులు… ప్రజాస్వామ్యంపై దాడులే!.. . ధనుంజయ్ రెడ్డి పై కేసులు ఎత్తివేయాలి – బోధన్‌లో జర్నలిస్టుల ఆందోళన… . ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చే పంథా మానేయండి – జర్నలిస్టుల హెచ్చరిక….

SHARE:

బోధన్, మే 10:
బోధన్ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 11. గంటలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కలిసి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడికి తీవ్ర నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టులు మొదట నివాళులు అర్పించి, అనంతరం మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం దాడులు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.

“ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రశ్నించే హక్కు మారదు. మీడియా ప్రశ్నలు అడగడం తప్పా? ప్రతిసారీ మీడియాపై కేసులు, దాడులు చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?” అని వారు ప్రశ్నించారు.”ధనుంజయ్ రెడ్డి పై కేసులను వెంటనే ఎత్తేయాలని” వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయస్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు ఇంకా ఉధృతమవుతాయని హెచ్చరించారు….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india