Post Views: 123
: దేశ భద్రత పరంగా కీలక నిర్ణయం తీసుకుంటూ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మీడియా ఛానల్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కీలక సూచనలు చేసింది. భద్రతా దళాల కదలికలు, ఆపరేషన్లను ప్రత్యక్షంగా ప్రసారం చేయడాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేస్తూ, “ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల ఆపరేషన్ల రహస్యత దెబ్బతింటుంది. ఇది దళాల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించవచ్చు” అని పేర్కొంది.
దేశ రక్షణకు మద్దతుగా వ్యవహరించాలని, అన్ని మీడియా సంస్థలు బాధ్యతతో ప్రవర్తించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. భద్రతా సిబ్బంది కృషిని గౌరవిస్తూ, అవసరమైన సమాచారాన్ని మాత్రమే అధికారిక వేదికల ద్వారా పంచుకోవాలని సూచించింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








