V1News Telangana

best news portal development company in india

సేంద్రియ వ్యవసాయమే ప్రజల ఆరోగ్య రక్షణకు మార్గం: ఎమ్మెల్యే రామారావు పిలుపు

SHARE:

ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పత్తి, మక్క, జొన్న, సోయా వంటి పంటలకు తక్కువ మోతాదులో యూరియా వాడాలని సూచించారు. సేంద్రియ ఎరువులైన ఆవుపేడ, పెంటను ఉపయోగించి పంటల ఉత్పత్తిని పెంచాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ శాఖ ఏడిఓ అంజి ప్రసాద్ మాట్లాడుతూ, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, సహజ మార్గాలను అనుసరించాలని చెప్పారు. హార్టికల్చర్ అధికారి పండ్ల తోటలు, కూరగాయలు పెంచడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మాట్లాడుతూ, తెలంగాణలో జొన్నలకు మద్దతు ధర కల్పిస్తున్నామని, మహారాష్ట్ర నుండి అక్రమంగా వచ్చే జొన్నలను అడ్డుకోవాలని వ్యవసాయ అధికారులను కోరారు.

ఇక ఎమ్మెల్యే రామారావు మాట్లాడుతూ, అధిక యూరియా, రసాయన మందుల వాడకాన్ని తగ్గించాలని, ఆవు మూత్రం, ఆవుపేడను ఉపయోగించి పంటలు పండించాలని రైతులకు సూచించారు. రసాయన మందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతుండగా, సేంద్రియంగా పండించిన కూరగాయలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india