V1News Telangana

best news portal development company in india

ఆపరేషన్‌ సిందూర్‌ ధాటికి పాక్‌ ఎయిర్‌స్పేస్‌ ఖాళీ! ఉగ్రదాడికి బదులుగా భారత్‌ మెరుపుదాడులు.. . పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు.. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కి పాక్ గగనతలంపై భయం.. . ఫ్లైట్ ట్రాకింగ్‌ మ్యాప్‌ చెబుతోంది – పాక్ ఖాళీ, భారత్‌ బిజీ…

SHARE:

పెహల్‌గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ “ఆపరేషన్‌ సిందూర్‌” చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడులు అంతగా ప్రభావం చూపాయని, పాక్‌ గగనతలాన్ని ఎయిర్‌లైన్స్‌ ఖాళీ చేసేయడం ద్వారా తెలుస్తోంది.

పాక్‌ మీదకు వెళ్లే అంతర్జాతీయ విమానాలు ఆ దేశ గగనతలాన్ని తప్పించుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌ ఎయిర్‌స్పేస్‌ మాత్రం విమానాల రాకపోకలతో నిండి కనిపించింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసిన మ్యాప్‌ ప్రకారం, పాకిస్తాన్‌ గగనతలం విమాన రహితంగా ఉండగా, భారత్‌ గగనతలంలో విమానాల రద్దీ ఎక్కువగా కనిపించింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india