బోధన్: వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకొని బోధన్ పట్టణం పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న శ్రీ నగరేశ్వర శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవీ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేశారు. అష్టాదశ పండ్ల రసాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమార్చన, పూల అర్చనలు చేశారు. ఆలయంలో భజనలు, కీర్తనలు ముగ్ధతరంగా సాగాయి.
ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రాంతాల ఆర్యవైశ్య సంఘాల సభ్యులు సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు కొత్త రాజేశ్వర్, గంజి వెంకటేశం, పబ్బ మురళి, కంటాల రమేష్, కన్నె సంతోష్, వాసర గంగాధర్, గంగం కిరణ్, పార్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








