V1News Telangana

best news portal development company in india

ఆపరేషన్ సిందూర్: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు… . భద్రతపై సీఎం సమీక్ష: రాజకీయాలకు తావు లేదు….. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగుల సెలవుల రద్దు: సీఎం ఆదేశం… ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం: ప్రత్యేక సెల్ ఏర్పాటు… సైబర్ భద్రత, రక్త నిల్వలు, మెడిసిన్ సిద్ధంగా ఉంచండి: సీఎం దిశానిర్దేశం… రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి: ముఖ్యమంత్రి ఆదేశాలు… అనధికార వలసదారులపై తక్షణ చర్యలు: రేవంత్ రెడ్డి…

SHARE:

ఆపరేషన్ సిందూర్‌పై సీఎం సమీక్ష: భద్రత, సైబర్ సెక్యూరిటీపై పటిష్ట చర్యలు…

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ భద్రతకి తెలంగాణ రాష్ట్రం అండగా ఉందనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేలా ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఈ సందర్భంలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసిన సీఎం, అన్ని అత్యవసర సేవల శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ, అందరూ విధులకు హాజరు కావాలన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలను కూడా తాత్కాలికంగా రద్దు చేసుకోవాలన్నారు.

మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగితే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజల కోసం 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇతర కీలక అంశాలు:

అనధికారికంగా నివసిస్తున్న విదేశీయులపై తక్షణ చర్యలు

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ

ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రత్యేక సెల్

బ్లడ్ బ్యాంకులు, మెడిసిన్లు సిద్ధంగా ఉంచడం

కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం

అలాగే, ఐటీ సంస్థలు, విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించారు. పాత నేరస్తులు, హిస్టరీ షీటర్లపై పోలీస్ శాఖ కచ్చితమైన నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india