సాలురా లో అధికారుల లేని ఆర్టీఓ చెక్‌పోస్ట్ – అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట ఎప్పుడు?
నిజామాబాద్ జిల్లా సాలురా చెక్‌పోస్ట్‌లో అధికారుల గైర్హాజరీ వల్ల అక్కడ అక్రమ వసూళ్లు రోజువారీ వ్యవహారంగా మారాయి. గత ఎనిమిది నెలలుగా ఆర్టీఓ అధికారి అక్కడ లేకపోవడంతో, ఒక కానిస్టేబుల్ మరియు ఒక ఆపరేటర్ అక్కడ దర్జాగా వసూళ్లు చేస్తూ, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ప్రతి రోజూ రూ.20,000 నుంచి రూ.30,000 వరకు వాహనదారుల నుంచి వసూలవుతున్నా, ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి లెక్కలు లేవు. చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాపన్న – గతంలో సీఎం కేసీఆర్ సెక్యూరిటీలో పని చేశాడనే పేరుతో అధికారులే గమ్మత్తుగా వుండిపోయారు. అతను స్థానికులపై బెదిరింపులకు పాల్పడుతూ, జేబులు నింపుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కీలక ప్రశ్నలు:
ఎనిమిది నెలలుగా అధికారి లేకపోతే చెక్‌పోస్ట్ నిర్వహణ ఎవరి చేతుల్లో ఉంది?
వసూలైన డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందా లేక వ్యక్తుల జేబుల్లోకా?
ఒకే కానిస్టేబుల్ ఏటాది తరబడి ఏ బదలీ లేకుండా ఎలా ఉంటున్నాడు?
గతంలో ఏసీబీ దాడులు జరిగినా చర్యలు ఎందుకు లేవు?
బాపన్నకు నిజంగా ఉన్నది ప్రభుత్వ మద్దతేనా?
వాహనదారులు ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, సంబంధిత శాఖల నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ హస్తం ఎంత త్వరగా వస్తుందో చూడాలి….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








