బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీలో గల శ్రీ రామ మందిరం అభివృద్ధికి తనవంతుగా ఆర్థిక సహాయం అందించనున్నట్టు బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన రెండు నివాస గృహాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దేవాలయాలు ప్రజల భక్తి కేంద్రాలు మాత్రమే కాకుండా, సంస్కృతి పరిరక్షణకు మూలస్తంభాలుగా ఉంటాయని అన్నారు. అలాంటి దేవస్థానాల అభివృద్ధికి ప్రభుత్వం గానీ, సమాజం గానీ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ రామ మందిరం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కమిటీ చేపట్టిన నివాస గృహాల నిర్మాణం ఒక మంచి ఆలోచన అని అభిప్రాయపడ్డారు. వాటి అద్దె ద్వారా ఆలయానికి స్థిర ఆదాయం అందించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ ప్రణాళికను అభినందిస్తూ, తనవంతుగా అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ ఎసిపి శ్రీనివాస్, పిసిసి డెలిగేట్ గంగ శంకర్, మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మిద్దెల రామరాజు, మీరు నజీర్ అలీ, అంకు దామోదర్, పెరిక స్వామి, బిళ్ళ రామ్మోహన్, విష్ణువర్ధన్ రెడ్డి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








