V1News Telangana

best news portal development company in india

భైంసాలో కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం: విట్టల్ రెడ్డిని ప్రశంసించిన కార్యకర్తలు, వివాదం

SHARE:

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ బంకెట్ హాల్‌లో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పిసిసి పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ మరియు యండి ఆవేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సభలో బాసర మండల కాంగ్రెస్ నాయకుడు ప్రసంగిస్తున్న సమయంలో, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి వెనుక కార్యకర్తల్లో విభేదాలు బయటపడ్డాయి. కొందరు కార్యకర్తలు ఆయనను అనుసరిస్తూ “విట్టల్ రెడ్డి జిందాబాద్” అంటూ నినాదాలు చేయగా, మరికొందరు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

అధికారిక వేదికపై నేతలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలను మరింత హైలైట్ చేసిన ఘటనగా భావిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india