మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి – బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్…
బోధన్ టౌన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. సోమవారం ఆయన ట్రాఫిక్ పోలీసులతో కలిసి బోధన్ బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెట్ల శాతం పెరిగితే మనుషులకే కాకుండా, జంతువులు, పశుపక్షాదులకు కూడా జీవించడానికి అనుకూల వాతావరణం లభిస్తుందని అన్నారు. “ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలైనా నాటి వాటిని జాగ్రత్తగా సంరక్షించాలి,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం వృక్షాల శాతం తక్కువగా ఉండటంతో పర్యావరణ సమస్యలు పెరిగిపోయాయని, అందుకే బాధ్యతగా మనందరం మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








