V1News Telangana

best news portal development company in india

ఓసిపి 5 కార్మికుని మృతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేపట్టాలి /// ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడి పట్టించుకోని ఓబి అధికారులు సింగరేణి యాజమాన్యం /// మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి///

SHARE:

ఓసిపి 5 కార్మికుని మృతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేపట్టాలి

ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడి పట్టించుకోని ఓబి అధికారులు సింగరేణి యాజమాన్యం

మృతి చెందిన కుటుంబానికి నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మే 05:-

పి సీ పటేల్ నిర్లక్ష్యానికి ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికుడి మృతి కార్మికుడు మృతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేపట్టాలని పలువురు నాయకులు డిమాండ్ రామగుండం ఓసిపి5 లో ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికులపై పనిభారాలు వేస్తూ చాలీచాలని జీతాలు ఇస్తూ కార్మికుల శ్రమను ఆసరా చేసుకుని కంపెనీ లాభాలు పెంచుకుంటున్న తీరుపై పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు సింగరేణి రామగుండం ఒసిపి 5 పీసీ పటేల్ ఓ బి కంపెనీలో చనిపోయిన కాంట్రాక్టు కార్మికుని మృతిపై విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించి చనిపోయిన కార్మికుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కార్మికుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అలాగే కంపెనీ కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు.రామగుండం ఆర్జీవన్ పరిధి లోని5 ఇంక్లైన్ పీసీ పటేల్లో సోమవారం జరిగిన కంపెనీ సూపర్వైజర్ వికాస్ దుర్మరణం పై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఓబి కంపెనీ వారు కాంట్రాక్ట్ కార్మికుల మరణాలను తప్పుదోవ పట్టించి తప్పించుకునే ప్రయత్నం ఓబి కాంట్రాక్టర్లకు అలవాటుగా ఆనవాయితీగా ఉంటుందని ఈ దుర్మరణం పై పూర్తి సమగ్ర విచారణ చేపట్టాలని నాయకులు ప్రభుత్వ యంత్రాంగాని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని బీహార్ నుంచి రప్పించి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా కార్మికుల సమక్షంలో ఇప్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం స్పందించి మృతి చెందిన కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india