V1News Telangana

best news portal development company in india

ఈనెల 6న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ ఆధ్వర్యంలో భైంసాలో ఏర్పాటు

SHARE:

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఈనెల 6వ తేదీన భైంసా పట్టణంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ తెలిపారు. డిసిసి అధ్యక్షుడు కూచటి శ్రీ హరీరావు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సమావేశం స్థానిక కమల జిన్నింగ్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శ్రీ బ్యాంక్ ఇట్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, లైబ్రరీ చైర్మన్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, రైతు, విద్యార్థి విభాగాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విభాగాల అధ్యక్షులు, NSUI నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీసీసీ సభ్యులు, సేవాదళ్, మండల, పట్టణ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, పిఎస్సీసీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు హాజరుకానున్నారు.

సమావేశానికి పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ మరియు అవేజ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india