మహిషా పట్టణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా రావుల రాము గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు, పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారు (మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గారి కుమారుడు), ఇతర పార్టీలోని పదవాధికారులు సహకారం అందించారు.
రావుల రాము గారు హిందూ వాహినిలో పనిచేస్తూ ధర్మరక్షణ కోసం పలు పోరాటాలు చేసి జైలు శిక్షను కూడా అనుభవించారు. కుటుంబ పరిస్థితులు దయనీయంగా ఉన్నా, పార్టీ లాయర్ల సహాయంతో జైలు నుండి విడుదలై, ఇప్పుడు పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమితులవడం అభినందనీయం.
గత 35 సంవత్సరాలుగా మత కల్లోలాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న శక్తులకు ఇది ఒక దీటైన జవాబు అని నేతలు అభిప్రాయపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మహిషా పట్టణ మున్సిపల్ చైర్మన్ స్థానం భారతీయ జనతా పార్టీకి దక్కేలా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
- ఈ కార్యక్రమంలో వార్డు నం. 7 కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే గారు, బైసా పట్టణ మాజీ BJP సెక్రటరీ గోపాల్ సూత్రావే గారు, ప్రకాష్ ధనేవార్, మహేష్, బాలాజీ పటేల్ మరియు స్వాములు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








