V1News Telangana

best news portal development company in india

శ్రీ బసవేశ్వర్ జయంతి ఉత్సవాలు వైభవంగా.. . బైంసాలో లింగాయతుల శోభాయాత్ర ఆకట్టుకుంది… . డా. గణేష్ పాటిల్: ‘సమాజంలో ఏకత్వమే మన మార్గం’….

SHARE:

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఈరోజు శ్రీ బసవేశ్వర్ మహారాజ్ 892వ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా లింగాయతులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమాల్లో భాగంగా లింగాయతుల ఆఫీస్ నుండి శివాజీ చౌక్ మీదుగా బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అలాగే కుబీర్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహానికి పూలమాలలతో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గణేష్ పాటిల్ మహారాజ్ మాట్లాడుతూ, “సమాజంలో కుల, మత బేధాలు లేకుండా మానవతా విలువలను పాటించాలి” అని అన్నారు. ఆయన సందేశం ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచేలా ఉంది.

జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాయి. గ్రామస్థులు, యువత, పెద్దలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india