V1News Telangana

best news portal development company in india

కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలి* చికాగో అమరవీరుల స్ఫూర్తితో, కార్మిక హక్కుల రక్షణకై పోరాటం చేద్దామని

SHARE:

* చికాగో అమరవీరుల స్ఫూర్తితో, కార్మిక హక్కుల రక్షణకై పోరాటం చేద్దామని *భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU)జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరిత* పిలుపునిచ్చారు. గురువారం బైంసా లో మేడే సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఐబి వద్ద ఎర్రజెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీడీ, హాస్పిటల్, అంగన్వాడి, కేజీబీవీ, ఆశ, హాస్టల్ ఇతర అనేక రకాల లక్షలాదిమంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా బీడీ కార్మికులు జీవనభృతి ఇవ్వాలని, బీడీ పరిశ్రమను నాశనం చేసే కొట్ప చట్టాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాల జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తున్నారన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లందరూ తమ పని రెగ్యులరైజ్ కోసం, 26వేల కనీస వేతనం అమలు కోసం, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతుంటే, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, కార్పొరేట్ల కు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తూ కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కుల రక్షణకై అమెరికాలో అమరులైన చికాగో వీరుల సాక్షిగా పోరాటాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. *అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు* మాట్లాడుతూ కార్మిక కర్షక ఐక్యతతో ఉద్యమాలు నిర్వహించి కార్పొరేట్ అనుకూల మోడీ ప్రభుత్వ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గంగామణి, భోజన్న, లత విజయలక్ష్మి, ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్, పోతన తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india