Post Views: 111
భైంసా పట్టణంలోని RZ ఫంక్షన్ హాల్లో మాదిగ సమాజానికి చెందిన విద్యార్థుల కోసం చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్రాధ్యక్షుడు మంద దేవేందర్ ప్రసాద్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందరిల రమేష్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శుభ శ్రీ పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలపై స్పష్టతనిచ్చే మోటివేషన్ సెషన్లు నిర్వహించడంతోపాటు, ప్రభుత్వ సదుపాయాలు, గ్రూప్స్, ఎంబిబిఎస్, ఆర్మీ వంటి రంగాలలో అవకాశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, MRPS ప్రతినిధులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








