మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా భైంసా MRO కార్యాలయం ఎదుట ఉన్న ఐలమ్మ గద్దె వద్ద జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ, “కార్మికులు కేవలం 8 గంటలు మాత్రమే పని చేయాలి. అయితే యాజమాన్యాలు చట్టానికి విరుద్ధంగా ఎక్కువ గంటల పని చేయిస్తున్నారు,” అన్నారు.
అలాగే, “కార్మికుడి లేకుండా ఉత్పత్తి అసాధ్యం అయినప్పటికీ, శ్రామికులకెక్కడా సరైన గుర్తింపు లేదు. మహిళా కార్మికులకు పని ప్రదేశాల్లో సౌకర్యాలు, భద్రత లేదని, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పనికి తగ్గ ప్రతిఫలం లభించడంలేదని” ఆయన విమర్శించారు. కార్మికులకు PF, ఆరోగ్య భద్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వలస కార్మికులకు రక్షణ ఇవ్వాలని, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెరిగిన ధరలతో తులనాత్మకంగా వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్, నవీన్, ముఖేష్, మహమ్మద్ రఫీ, వినోద్, లక్ష్మణ్, ముత్యం తదితర జన సైనికులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








