బోధన్ టౌన్:
బోధన్ పట్టణంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న మహనీయుల జయంతిని విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకుడు పరిమి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు….
తాలూకా రైస్ మిల్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో పుట్టిన మహనీయుల జయంతులను గుర్తించి, ఒకే వేదికపై ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా బోధన్‌లో ప్రత్యేకంగా జరగడం గర్వకారణమని అన్నారు.
బోధన్ రాఘవులు రైస్ మిల్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుందని వివరించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి వేకువజాము 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో జయంతి వేడుకలు జరగనున్నాయని వెల్లడించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర బృందం ‘ఆమ్నే-సామ్నే’ కార్యక్రమం నిర్వహించనుంది.
ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు నీ రడి ఈశ్వర్, నీ రడి కుమార్, కొండ్ర వెంకటి, సింగడి పాండు, సూర్యకాంత్, దేవేందర్, కారం స్వామి, రాహుల్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








